BREAKING: ఢిల్లీలో బాణసంచాపై శాశ్వత నిషేధం!
తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోన్న తరుణంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో బాణసంచాపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఏడాది పొడవునా అన్ని రకాల బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలు, ఆన్లైన్లో డెలివరీలతోపాటు వాటి వినియోగంపై నిషేధం విధిస్తూ దిల్లీ పర్యావరణ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.