తనపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఫార్ములా రేసింగ్ కు సంబంధించి ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా రూ. 55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ చెల్లింపులు చేయడం ప్రధాన అభియోగం.