నాగబాబు మంత్రి పదవిపై వీడని సస్పెన్స్!
AP: నాగబాబు మంత్రి పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆయన ప్రమాణస్వీకారానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ముందుగా నాగబాబును ఎమ్మెల్సీగా చేసిన తర్వాత మంత్రిగా చేయాలని అధిష్టానం భావిస్తోంది. అయితే చాలా మంది మంత్రి పదవిని ఆశిస్తుండటంతో నాగబాబును ఎమ్మెల్సీగా చేయకుండా మంత్రిని చేస్తే కొంత అసంతృప్తి రావొచ్చని అధిష్టానం భావిస్తోంది.