365 రకాల వంటకాలతో కొత్త అల్లుళ్లకు ఆతిథ్యం (వీడియో)
AP: గోదారోళ్లు అంటేనే మర్యాదలకు మారు పేరు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లకు 365 రకాల వంటకాలతో విందు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నందమూరి గరువుకు చెందిన ఆకుల శ్రీనివాస్, ఆయన సోదరుడు సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లకు రాచమర్యాదలు చేశారు. 365 రకాల వంటకాలు వడ్డించి పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.