మధ్య తరగతి ప్రజలపై తగ్గిన పన్ను భారం
గత పదేళ్లలో ఏడాదికి రూ.20 లక్షల కంటే తక్కువ సంపాదన ఉన్న మధ్య తరగతి వర్గాలపై పన్ను భారం తగ్గింది. అదే సమయంలో రూ.50 లక్షల కంటే అధిక వార్షికాదాయం ఉన్న వారు చెల్లించే పన్ను మొత్తం గణనీయంగా పెరిగింది. ఐటీఆర్ సమర్పణ వివరాల ప్రకారం రూ.50 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారి సంఖ్య 2013-14లో 1.85 లక్షలు ఉండగా, 2023-24 నాటికి 5 రెట్లు పెరిగి 9.39 లక్షలకు చేరింది. దీంతో మధ్య తరగతి వర్గాలపై పన్ను భారం తగ్గనట్లైంది.