రష్యాకు చెందిన ప్రముఖ టెలివిజన్ చెఫ్ అయిన అలెక్సీ జిమిన్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. కాగా, ఆయన గతంలో ఉక్రెయిన్పై మాస్కో సైనిక చర్యను వ్యతిరేకిస్తూ పుతిన్ను విమర్శించాడు. జిమిన్ ఇటీవల తన పుసక్తం ప్రచారం నిమిత్తం సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ వెళ్లారు. అక్కడే ఓ హోటల్ గదిలో ఆయన విగతజీవిగా కన్పించారు. జిమిన్ మరణానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.