దేశంలో వంట నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 24% ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో వీటి ధరలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి టారీఫ్‌ను కేంద్రం పెంచుకుంటూపోతోంది. రెండు నెలల్లో లీటర్‌కు రూ.40 వరకు పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో లీటర్ వంట నూనె ధర రెండు వందల మార్కు దాటే అవకాశం ఉంది.