ఉప ముఖ్యమంత్రి పై మండి పడ్డ మందకృష్ణ మాదిగ
పవన్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలు మాదిగ మహిళను అవమాన పరిచినట్లేనని, లా అండ్ ఆర్డర్ ఫెయిలంటే , చంద్రబాబును అన్నట్లే కదా? కాపులకు పవన్ పెద్దన్న కావొచ్చు. మాకు కాదు. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికే నష్టం అని అన్నారు. పవన్ తన శాఖను సరిగా నిర్వహించడం లేదని మరో మంత్రి అంటే ఎలా ఉంటుంది? అని విమర్శించారు.