
ఏపీలో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
ఏపీలోని అల్లూరి జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అల్లూరి జిల్లాలోని వై.రామవరం, జీకేవీధి మండలాల సరిహద్దుల్లో ఈ ఎన్కౌంటర్జరిగింది. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతాబలగాలు చనిపోయిన మావోయిస్టులు వద్ద నుంచి రెండు ఏకే-47లు స్వాధీనం చేసుకున్నాయి.