రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని మాజీ శాసన మండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు. సోమవారం ఉయ్యూరు లోని ఆయన స్వగృహంలో రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాగిత కొండ (జేమ్స్) ఆధ్వర్యంలో వినతిపత్రం రూపంలో అందజేశారు.