ఆదోని: అసెంబ్లీ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి బుధవారం మాట్లాడారు. గుండె జబ్బు, క్యాన్సర్, లివర్ సంబంధిత వ్యాధులు వంటి ప్రాణాంతక రోగాలు వచ్చినప్పుడు పేద, మధ్య తరగతి కుటుంబాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం చాలా కష్టమని అన్నారు. అందువల్ల ఈ రకాల అన్ని వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్య మంత్రి సత్యకుమార్ ని కోరారు.