ఆదోని: సీపీఐ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి
సీపీఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ కర్నూలు జిల్లా కార్య వర్గ సభ్యులు అజయ్ బాబు, మండల కార్యదర్శి కల్లుబావి రాజు పిలుపునిచ్చారు. ఆదోని మండల నాగనాథనహళ్లి గ్రామంలో జరిగిన సమావేశంలో 1925లో స్థాపితమైన సీపీఐ స్వాతంత్ర పోరాటం నుంచి అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిందని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొంటూ డిసెంబర్ 26 నుంచి గ్రామస్థాయిలో శతజయంతి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.