కోడుమూరులో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసి నిప్పంటించిన దుండగుల చర్యను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి బుధవారం తీవ్రంగా ఖండించారు. బుధవారం కోడుమూరులో మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, పర్యటించి, మాట్లాడారు కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చక పోవడమే కాకుండా విధ్వంసాలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వారికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.