మంత్రాలయం: ఒకరోజు ముందే పెన్షన్ దారులకు పెన్షన్ పండుగ
రాష్ట్రంలో ఒకరోజు ముందే పెన్షన్ దారులకు పెన్షన్ పండుగ వచ్చిందని మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కోసిగి మండలం పల్లెపాడులో పెన్షన్ పంపిణిలో పాల్గొని, ఇంటింటికీ తిరుగుతూ సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ల నగదును అందజేసి, మాట్లాడారు. జనవరికు సంబంధించిన పెన్షన్లు, ఉద్యోగస్తులకు జీతాలు ఒకరోజు ముందే ఇచ్చే ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.