AP: నేడు రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉండనుంది. చివర్లో CM చంద్రబాబు సమాధానమిస్తారు. కాగా మార్చి 3 నుంచి ప్రతిరోజూ ఖచ్చితంగా గంటపాటు ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (BAC) నిర్ణయించింది. ఇక 3, 4, 5 తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ ఉంటుంది. 5న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిస్తారు.