కొలనుభారతి అమ్మవారికి విశేష పూజలు
రాష్ట్రంలోనే ఏకైక సరస్వతి ఆలయంగా పేరుగాంచిన కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి క్షేత్రంలో గురువారం సరస్వతి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాతక్కాల సమయంలోనే అమ్మవారికి అభిషేకాలు అర్చనలు తదితర పూజా క్రతువులను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కాగా స్వాతంత్ర దినోత్సవం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.