
దేవాదాయశాఖ కమిషనర్ ను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే
రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ గా ఇటీవల నూతన బాధ్యతలు చేపట్టిన రామచంద్ర మోహన్ ను అమరావతిలోని సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో సోమవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం క్షేత్రాభివృద్ధికి సహకరించాలని అన్నారు. అనంతరం క్షేత్రాభివృద్ధిపై వారు చర్చించారు.