కలిగిరి: కోడిపందాలు ఆడుతున్న 8 మంది అరెస్టు
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం, నాగసముద్రం అటవీ ప్రాంతంలో కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకోని, వారి వద్ద నుంచి రూ.8,300 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస స్టేషన్ కు తరలించారు.