Mar 25, 2025, 02:03 IST/
రోడ్డు ప్రమాదం.. వాగులో పడిపోయిన వాహనం
Mar 25, 2025, 02:03 IST
TG: భద్రాద్రి కొత్తగూడెంలో రోడ్డుప్రమాదం జరిగింది. చీపురుగూడెం నుంచి రాజుల పాలెం కూలి కోసం వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ, ముందు టైరు ఒక్కసారి పగలడంతో అదుపుతప్పి వాగులో పడిపోయింది. పదిమందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరందరినీ కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, జూలూరుపాడు మండలం బేతాళపాడుకి చెందిన కూలీలు రాజుపాలెం వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం.