కలిగిరి మండలం రావులకొల్లులో ఆశ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి నీ సర్పంచ్ వెంగప్ప నాయుడు ఆదేశాలతో అధికారులు విధులు నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆమెకు మద్దతుగా ఆశ వర్కర్ల యూనియన్లు ఇటీవల భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా మంగళవారం ఆత్మకూరు ప్రభుత్వ అర్బన్ వైద్యశాల ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.