Nov 29, 2024, 17:11 IST/
టెన్త్ ఇంటర్నల్ మార్కుల రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
Nov 29, 2024, 17:11 IST
టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యాసంవత్సరానికి నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులు.. వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఉన్నాయి. కాగా, 2024-25 నుంచి ఇంటర్నల్ పరీక్షలకు మార్కులను కేటాయించే విధానాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.