తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లు , గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగటంపై రాష్ట్ర వ్యాప్తంగా Nov 30న SFI రాష్ట్ర కమిటీ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యశాఖను పట్టించుకునే వారే లేకుండా పోయారని SFI రాష్ట్ర అధ్యక్షులు R.L.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చలనం లేకపోవడంతోనే విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామన్నారు.