నెల్లూరు డిఆర్ఓ లవన్న బదిలీ
నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా జే. ఉదయ భాస్కరావు నియామకం అయ్యారు. డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జే. ఉదయ భాస్కర్ రావును నెల్లూరు డీఆర్ఓ గా ప్రభుత్వం నియమించింది. నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న లవన్న బదిలీ అయ్యారు. ప్రభుత్వ బదిలీల్లో భాగంగా గురువారం అదేశాలు జారీ చేశారు.