వరికుంటపాడు: వర్షాలు వస్తే చాలు ఈ మండలంలో ఇబ్బందులే
వర్షాలు అంటే ఉదయగిరి నియోజకవర్గంలో మొదటగా గుర్తు వచ్చే మండలం వరికుంటపాడు. ఈ నియోజకవర్గం వ్యాప్తంగా ఎప్పుడైనా సరే భారీ వర్షాలు పడితే ఈ మండలంలో ఎక్కువగా బ్రిడ్జిలు కూలిపోవడం, నీట మునగడం వంటివి జరుగుతుంటాయి. మండలంలోని గ్రామాల్లో ఎక్కువగా బ్రిడ్జిలు ఉండడంతో వర్షాలు వస్తే వాగు వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కాగా ఈరోజు 41. 8 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ మండలంలో నమోదయ్యింది.