

ఉదయగిరిలో విపరీతంగా కురుస్తున్న మంచు
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో భయంకరంగా మంచు కురుస్తుంది. తెల్లవారుజాము నుంచే విపరీతంగా మంచు కురుస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్ల ఇలాగే మంచు కురుస్తుండడంతో ప్రయాణికులు, చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలవుతున్నప్పటికి మంచు తగ్గడం లేదు.