VIDEO: మృత్యుంజయురాలు!
కజకిస్థాన్ అజెర్బైజాన్ ఎయిర్‌లైన్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన సిబ్బంది ఐదన్ రహీమ్లీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ప్రాణాలతో బయటపడిన ఆమెకు స్పృహ వచ్చింది. తన తోటి సిబ్బందిని, పైలట్లను కోల్పోవడంతో ఆమె కుంగిపోయారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘మృత్యుంజయురాలు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 67 మంది ప్రయాణికులు ఉండగా.. 38 మంది చనిపోయారు.