తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నిర్మాత, హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ ఘటనలో బాలుడి తల్లి రేవతి మృతి చెందిగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.