ఫార్ములా-ఈ రేసులో ఎలాంటి అవకతవకలు జరగలేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు ఆయన లేఖ రాశారు. 'ఫార్ములా-ఈ రేస్‌పై శాసనసభలో చర్చ పెట్టాలి. HYDకి మంచి చేసే ఈ రేస్‌ను కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. దీని వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరింది. కావాలనే ఈ రేస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు' అనిపేర్కొన్నారు.