నెల్లూరులో జికా వైరస్‌ కలకలం.. స్పందించిన మంత్రి ఆనం

63చూసినవారు
నెల్లూరులో జికా వైరస్‌ కలకలం.. స్పందించిన మంత్రి ఆనం
AP: నెల్లూరు జిల్లాలో జికా వైరస్‌ కలకలంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. ‘మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం. కార్పొరేట్‌ వైద్యం కోసం చెన్నై తరలించాం. వ్యాధి నిర్ధరణ కోసం బాలుడి బ్లడ్‌ శాంపిల్స్‌ను అధికారులు పుణే ల్యాబ్‌కు పంపించారు. ఆ గ్రామానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లాయి’ అని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్