ఏపీ మోడల్ స్కూల్ వద్ద అగ్ని ప్రమాదం

4453చూసినవారు
ఏపీ మోడల్ స్కూల్ వద్ద అగ్ని ప్రమాదం
రాచర్ల మండల ఏపీ మోడల్ స్కూల్ వద్ద బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల సమీపంలో ఉన్న పిచ్చి మొక్కలలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు దావాలంగ వ్యాపించడంతో పాఠశాల ప్రిన్సిపల్ అప్రమత్తమై అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు దావాలంగ వ్యాపించిన మంటలను ఆర్పి వేశారు. అయితే మంటలు అంటుకున్నాయో తెలియలేదని అధికారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్