ఒంగోలు: అధికారులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి
అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు. ఒంగోలులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందితో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏవైనా తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు.