శివలింగం దగ్గర రీల్స్ చేసిన యువతి.. చివరికి (వీడియో)
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి హరిద్వార్ గంగా ఘాట్ దగ్గర ఉన్న శివలింగం దగ్గరకి వచ్చి ఫేమ్ అవ్వడం కోసం రీల్ చేసింది. అనంతరం ఘాట్ ముందు ఉన్న ఐరన్ బెడ్ పై నడుస్తూ ముందుకు వెళ్లడంతో.. ఆమె ప్రమాదవశాత్తు ఘాట్ లో పడిపోయింది. దీంతో ఆమె కొంచెం దూరం కొట్టుకుపోయి.. మళ్ళీ ఈదుకుంటూ వడ్డుకు చేరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.