డొనాల్డ్ ట్రంప్ నియంతలను ఆరాధిస్తారని ఆయనతో జరిగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్లో కమలా హారిస్ ఆరోపించారు. "భోజనంగా నిన్ను తినేసే నియంతతో నువ్వు స్నేహం చేస్తున్నావని అనుకుంటున్నావు" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ప్రస్తావిస్తూ ట్రంప్ తో ఆమె అన్నారు. హారిస్ ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ, "శాంతి చర్చలకు ఆమెను పంపారు. ఆపై మూడు రోజులకే యుద్ధం ప్రారంభమైంది" అని విమర్శించారు.