వియత్నాంను 'యాగి' తుఫాన్ వణికించింది. ఈ విపత్తు కారణంగా వరదలు సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో మృతుల సంఖ్య తాజాగా 140కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. 60 మందికి పైగా గల్లంతైనట్లు పేర్కొన్నారు. వేల సంఖ్యలో ప్రజలు సాయ కోసం ఎదరుచూస్తున్నట్లు చెప్పారు. గంటకు 149 కి.మీ .లకు పైగా అతి వేగంతో గాలులు వీస్తున్నాయని.. ఉత్తర వియత్నాంలో అనేక నదుల నీటి మట్టాలు ప్రమాదకరంగా పెరిగాయని అధికారులు తెలిపారు.