
ఏఐతో రూ.4 వేల కోట్లు ఆదా: మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ఇటీవల భారీ లే ఆఫ్లకు పాల్పడిన నేపథ్యంలో.. ఏఐ వినియోగం ద్వారా కంపెనీకి ఎలా లాభం కలిగిందో వెల్లడించింది. కాల్ సెంటర్ వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించడంతో 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4 వేల కోట్లు) ఆదా అయినట్లు సంస్థ పేర్కొంది. అలాగే, కొత్త ప్రొడక్ట్‌ల కోడ్ రూపకల్పనలో 35 శాతం ఉద్యోగులు గిట్‌హబ్ కోపైలట్ టూల్‌ను ఉపయోగిస్తున్నారని మైక్రోసాఫ్ట్ తెలిపింది.