ఏపీకి స్వర్ణయుగం మొదలైంది: మాజీ ఎంపీ జీవీఎల్
ఏపీకి స్వర్ణయుగం మొదలైందని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు తమ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వారికి స్టీల్ ప్లాంట్ సమస్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధి పక్కదారి పడుతుందని, తాము రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.