భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు హిమాని మోర్. హరియాణాలోని సోనిపటకు చెందిన 25 ఏళ్ల హిమాని జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్. వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఢిల్లీలోని మిరండా హౌజ్ కాలేజీలో రాజనీతిశాస్త్రం, వ్యాయామ విద్యలో డిగ్రీ చేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఓ యూనివర్సిటీలో క్రీడలకు సంబంధించిన కోర్సు చేస్తున్నారు.