AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి 11,65,264 మంది చిన్నారులు ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోలేదు. చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.