రైతులకు శుభవార్త.. ఖరీఫ్ నుంచే వడ్లకు రూ.500 బోనస్
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఖరీఫ్ సిజన్ నుంచే సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతులకు లబ్ధి చేకూర్చుతామని వెల్లడించారు.