రాహుల్ గాంధీపై వివాదాస్పద కామెంట్స్ చేసిన శివసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

66చూసినవారు
రాహుల్ గాంధీపై వివాదాస్పద కామెంట్స్ చేసిన శివసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన ఎమ్మెల్యే సంజయ్‌ గైక్వాడ్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్‌ శ్రేణుల ఫిర్యాదుతో బుల్దానా నగర పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ కాపీని కాంగ్రెస్‌ ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసింది. రాహుల్‌ నాలుకను కోస్తే రూ.11లక్షలు రివార్డు ఇస్తానంటూ ఎమ్మెల్యే చేసిన ప్రకటన క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే.

సంబంధిత పోస్ట్