పామిడి: అమ్మవారి ఆలయంలో ఉచిత వైద్య శిబిరం
పామిడి అమ్మవారిశాలలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పామిడి ఆయుష్ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి కృష్ణవేణి బుధవారం రోగులకు ఉచిత పరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. వాసవి మాతృ మండలి అధ్యక్షులు రాజేశ్వరి, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఉపేంద్ర ఆమెను సత్కరించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు కే. నారాయణ మూర్తి పాల్గొన్నారు.