విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి
గుత్తి మండలం పెద్దోడి గ్రామంలోని పాఠశాలను బుధవారం సాయంకాలం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, గుత్తి టీడీపీ మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలోని సమస్యల గురించి విద్యార్థులకు ఆరా తీశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.