
రాజమండ్రి: 'ఆడుదాం ఆంధ్ర' అవినీతిపై విచారణ జరపాలి
గత వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్ర అంటూ రూ. 120 కోట్ల అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేస్తే అసలు దోషులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ఎన్నికల ముందు, అప్పటి సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర అంటూ యువత జీవితాలతో ఆడుకున్నారన్నారు.