కమీషన్ దృష్టికి గిరిజనుల సమస్యలు
జాతీయ గిరిజన కమిషన్ దృష్టికి గిరిజనుల సమస్యలు పాతపట్నం.. నియోజకవర్గం బిజెపి సీనియర్ సిరిపురం తేజేశ్వరరావు శనివారం తీసుకెళ్లారు. మెళియాపుట్టి మండలం కేరాసింగి లో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్, ఎస్టీ కమిషన్ అధికార బృందానికి బీజేపీ సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు స్వాగతం పలికారు. నియోజక వర్గం పరిధిలోని మెళియాపుట్టి, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, ఎల్.ఎన్.పేట మండలాల గిరిజనసమస్యలు సిరిపురం తీసుకెళ్లారు.