పాతపట్నం: పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాన్ని మంగళవారం పాతపట్నం మామిడి ఎమ్మెల్యే గోవిందరావు ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువులకు ట్యాగింగ్ చేయించుకోవాలని, అలాగే పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలని, పాడి పశువుల పెంపక రైతులకు పశు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటు ఉండాలని అధికారులకు తెలిపారు.