సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ట్యాబ్‌ల కొనుగోళ్లలో ఆరోపణలు ఉన్నాయి. అగ్ని మొబైల్ యాప్‌ను జేబు సంస్థలకు కట్టబెట్టారని ఆయనపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అభియోగాలపై నెలలోపు వివరణ ఇవ్వాలని సంజయ్‌ని ప్రభుత్వం ఆదేశించింది.