ఏపీ అతిపెద్ద పెట్రో కెమికల్ హబ్‌గా తయారవుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్రో కెమికల్ హబ్ అంశంపై దావోస్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.."పెట్రో కెమికల్ పరిశ్రమలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. 2040 నాటికి ట్రిలియన్ డాలర్ల పరిశ్రమగా పెట్రో కెమికల్ రంగం వృద్ధి చెందుతుంది. త్వరలో రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తుంది. త్వరలో దేశంలో గ్రీన్ ఎనర్జీలో 30 శాతం వాటా ఏపీ కలిగి ఉంటుంది." అని అన్నారు.