నందమూరి తమన్ అంటూ భువనేశ్వరి కామెంట్స్

70చూసినవారు
NTR ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనున్నట్లు నారా భువనేశ్వరి ప్రకటించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ టీం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించబోతుందని నేడు అమరావతిలో ఆమె తెలిపారు. ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ను సంప్రదించామని ఆమె పేర్కొన్నారు. అయితే మొదటగా ఎన్.తమన్ అని తర్వాత సారీ నందమూరి తమన్ అంటూ నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్