ఇవాళ వైకుంఠ ఏకాదశి.. చేయకూడని పనులివే!
తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలకు వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. అయితే ఇవాళ కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పరమ పవిత్రమైన ఈ రోజు బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకూడదు. మాంసం, మద్యపానాన్ని ముట్టరాదు. పగలు నిద్రపోరాదు. తులసి ఆకులు కోయవద్దు. ఇతరులను బాధపెట్టేలా విమర్శలు, కఠిన మాటలు మాట్లాడొద్దు. శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలి. పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి.