శ్రీమహావిష్ణువు శాశ్వత నివాసమైన వైకుంఠానికి చేరుకోవాలని యుగయుగాల నుంచి కోట్లాదిమంది భక్తులు ఆశిస్తుంటారు. ఉత్తర ద్వారం తప్ప మిగిలిన ద్వారాల నుంచి వైకుంఠానికి వెళితే కొంత కాలం మాత్రమే ఉండవచ్చు. కానీ ఉత్తర ద్వారం నుంచి వెళితే స్వామివారి కైంకర్యాల కోసం అక్కడే ఉండవచ్చు. ఏ భక్తుడికైనా అంతకంటే కావాల్సింది ఏముంది. అందుకనే కైంకర్యాలు అంటే సేవల నిమిత్తం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉండి ఆ పద్మనాభుడి సేవల్లో నిత్యం పాల్గొనవచ్చు.